Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

★ నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉ. 10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. లక్ష ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసే అవకాశం.. విద్య, పోలీస్, వైద్య శాఖల్లో భారీగా పోస్టులు
★ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు
★ నేడు హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ సమావేశం.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో భేటీ కానున్న కృష్ణా బోర్డు ఛైర్మన్
★ నేడు కాకినాడ జేఎన్టీయూ 8వ స్నాతకోత్సవం , ఆన్‌లైన్ ద్వారా పాల్గొననున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్
★ విజయనగరంలో నేడు మంత్రి బొత్స కుమారుడి వివాహ రిసెప్షన్.. హాజరుకానున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
★ నేడు గుంటూరులో బీజేపీ మహా ధర్నా.. మిర్చి రైతుల సమస్యలు, వరి ధాన్యం కొనుగోలు సమస్యలపై బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా… పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి
★ ఉక్రెయిన్‌లో నేడు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా.. మానవతా కారిడార్ ఏర్పాటు కోసం రష్యాల కాల్పుల విరమణ

Exit mobile version