What’s Today:
• తిరుమల: నేడు 7వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు ఉ.8 గంటలకు సూర్యప్రభ వాహనంపై విహరించనున్న శ్రీవారు.. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
• విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
• నేడు శ్రీశైలంలో 8వ రోజు దసరా మహోత్సవాలు.. సాయంత్రం మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం
• తూ.గో.: నేడు రాజమండ్రిలో అభివృద్ధి వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం.. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అధ్యక్షతన సమావేశం.. హాజరుకానున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
• దుర్గాష్టమి సందర్భంగా నేడు ఏపీ వ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు
• పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
• నేటి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలపై కేసులు నమోదు.. స్టాప్ లైన్, సిగ్నల్ దగ్గర లైన్ దాటితే రూ.100 జరిమానా.. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 వరకు జరిమానా.. రాంగ్ పార్కింగ్‌లో ఫోర్ వీలర్ పార్క్ చేస్తే రూ.600 జరిమానా
• హైదరాబాద్: మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం
• నేడు వాయుసేనలోకి ఎల్‌సీహెచ్ హెలికాప్టర్లు.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హెలికాప్టర్లు.. జోథ్‌పూర్‌లో ప్రారంభించనున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today