Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

> హైదరాబాద్‌: ఈరోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
> హైదరాబాద్: ఈరోజు రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని మోదీ.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్న మోదీ.. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డు మూసివేత
> హైదరాబాద్: ఈరోజు ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి
> వీఐపీల పర్యటన కారణంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మాదాపూర్, హెచ్‌సీసీ, పంజాగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్‌లో వాహనాల దారి మళ్లింపు
> గుంటూరు జిల్లా: నేడు కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. హాజరు కానున్న గుంటూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
> పల్నాడు జిల్లా: నేడు మాచర్ల లో మాజీ ముఖ్యమంత్రి కోనేజేటి రోశయ్య విగ్రహావిష్కరణ.. హాజరుకానున్న నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు , మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు
> తూర్పుగోదావరి జిల్లా: నేడు కొవ్వూరులో జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశం.. హోం మంత్రి తానేటి వనిత అధ్యక్షతన జరగనున్న సమావేశం.. హాజరు కానున్న పలువురు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు
> నెల్లూరు జిల్లా: మనుబోలు మండలంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
> నేడు మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో రాత్రి 8 గంటలకు ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్

Exit mobile version