Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ బంద్..

* నేడు అమరావతిలో నాల్గో రోజు బీజేపీ పాదయాత్ర, వెలగపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బూరిపాలెం, బోరుపాలెంలో కొనసాగనున్న బీజేపీ పాదయాత్ర

* హైదరాబాద్‌: నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ముందుకు చికోటి ప్రవీణ్‌.. హవాలా లావాదేవీలపై ప్రశ్నించనున్న అధికారులు

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన, గజ్వెల్ లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, దౌల్తాబాద్(మం) దొమ్మట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి

* నేడు మెదక్ జిల్లాకు రానున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. మెదక్ లో ఎరువుల రేక్ పాయింట్ ను ప్రారంభించనున్న మంత్రులు

* తిరుమల: ఇవాళ నుంచి అఖండ హరినామ సంకీర్తన పున:ప్రారంభం

* ఇవాళ ఆన్ లైన్ లో పవిత్రోత్సవాల సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు ఆన్ లైన్ లో 7వ తేది నుంచి 10వ తేది వరకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

* నేడు శ్రీశైలానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్.. రేపు స్వామి అమ్మవారిని దర్శించుకొనున్న మంత్రులు , శ్రీశైల ఆలయ, క్షేత్రాభివృద్ధిపై అధికారులతో చర్చించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

Exit mobile version