నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుంది. నేడు ముంబై వేదికగా చైన్నై-కోల్‌కత్తా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి.
నేడు, రేపు స్టాంప్‌డ్యూటీల కోసం 52 ఎస్బీఐ బ్రాంచీలు పనిచేయనున్నాయి. స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తితో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
నేడు శ్రీశైలానికి ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాక రానున్నారు. అలాగే రేపు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు సీజే దర్శించుకోనున్నారు.
నేడు ఎర్త్ అవర్ పాటించాలని ప్రజలను గవర్నర్ బిశ్వభూషణ్ కోరారు. ఈ నేపథ్యంలో నేడు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలి, అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని గవర్నర్ అన్నారు.
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో గవర్నర్ తమిళసై పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్పాపూర్‌లో చెంచులతో తమిళసై సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సబ్ సెంటర్లు, కుట్టుమిషన్ కేంద్రాలతో పాటు ఆశ్రమ పాఠశాలలను తమిళసై సందర్శించునున్నారు. అలాగే బైక్ అంబులెన్స్‌లను గవర్నర్ పంపిణీ చేయనున్నారు.
నేటి నుంచి తెలంగాణలో టెట్ దరాఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నారు.
నేడు సోనియాగాంధీ నివాసంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులతో సోనియా భేటీ కానున్నారు. పార్టీ ప్రక్షాళన, సంస్థాగత, అధ్యక్ష ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాన మంత్రులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే యోచనలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఉన్నారు.