Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు విశాఖలో రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన. ఆ౦ధ్ర యూనివర్సిటిలోని YVS మూర్తి ఆడిటోరియంలో జరగనున్న వర్క్ షాప్ లో పాల్గొనున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్

* నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం.

* భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరులో శోభాయాత్ర, బైక్ ర్యాలీ. పాల్గొననున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ.

*భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా విశాఖలో జెండా ఎగురవేయనున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

* నేడు రాజమండ్రిలో టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పర్యటన. గౌతమీ ఘాట్ ప్రక్కన కొత్తగా నిర్మించిన మహాకాళేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్న వైవీ.సుబ్బారెడ్డి.

*శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించనున్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.

* ఇవాళ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశం కానున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

Exit mobile version