Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకి అనంతగిరి హిల్స్ చేరుకోనున్న సీఎం రేవంత్.. హరిత రిసార్ట్స్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు.. తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్.. సాయంత్రం 4గంటలకి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి..

* నేడు మంచిర్యాలలోని క్యాతన్‌పల్లికి బీఆర్ఎస్ నాయకులు.. బాల్క సుమన్ ఇంటికి వెళ్లనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు.. ఇటీవల మంత్రి వివేక్ వాహనంపై రాళ్ళ దాడి కేసులో జైలుకు వెళ్లిన సుమన్.. బాల్క సుమన్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్..

* నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు.. పలు‌ అభివృద్ది పనులు ప్రారంభించనున్న సీఎం.. బహిరంగ సభ అనంతరం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ.. సీఎం పర్యటనతో భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..

* నేడు సాయంత్రం సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ.. సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలను వచ్చే కబినెట్ లో ఆమోదించే అవకాశం..

* నేడు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం.. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10:30 కు సమావేశం ప్రారంభం.. నగర అభివృద్ధి, కీలక అంశాలపై చర్చ..

* నేటి నుంచి రెండు రోజుల పాటు SAAP స్టేట్ లెవల్ చెస్ లీగ్ టోర్నమెంట్ 2026.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో షాప్ లీగ్ చెస్ రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు..

* నేడు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవా టికెట్లు విడుదల..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.

* నేడు ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నేతల నిరసన..

* నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ పోరు.. సూపర్-8లో ఆరంభ పోరు ఈరోజే..

* నేడు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..

Exit mobile version