రాజధాని అమరావతి రైతుల పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు ధర్మాసనం.
జిల్లాల విభజనపై సీఎం జగన్ కీలక సమావేశం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశం.డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు, సూచనల సేకరణకు రేపటితో ముగియనున్న గడువు
ఇవాళ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. పదాధికారుల సమావేశానికి హాజరుకానున్న జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ, పార్టీ అగ్ర నేతలు.
ఏపీకి రానున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి రానున్న కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రికి రాత్రి విందు ఇవ్వనున్న సీఎం జగన్.
నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లన్న పాలెం నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర
టీడీపీ కార్యాలయాల్లో ఇవాళ సర్పంచ్ లకు అవగాహన సదస్సు. కొత్త సర్పంచ్ లకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు. పాల్గొననున్న ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గెలుపొందిన సర్పంచ్ లు.
చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ భేటీ కానున్న టీడీపీ పొలిట్ బ్యూరో. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై చర్చ.
నేడు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామీ,అమ్మవార్ల కల్యాణ మహోత్సవం.