What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్
  • నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్
  • ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం.
  • ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర.
  • ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
  • ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు
  • నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు
  • నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
  • నేడు ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం.
  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని అన్ని గ్రామాలకు పవర్ కట్. మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకూ విద్యుత్ కి అంతరాయం.
  • నేటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా. జంబ్లింగ్ విధానంపై హైకోర్టు తీర్పు వెల్లడించడంతో ప్రాక్టికల్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసిన ఇంటర్ బోర్డు
  • నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో జామి ఎల్లమ్మ జాతర. పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు.
  • నేడు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
  • కర్నూలు జిల్లా అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఎగువ అహోబిలంలో హనుమంత వాహనసేవ, దిగువ అహోబిలంలో హంస వాహన సేవ.