What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.11.30 కి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనున్న హరీష్ రావు. మండలిలో బడ్జెట్ పెట్ట నున్న శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి
  • నేడు యూపీలో ఆఖరి, ఏడవ విడత అసెంబ్లీ ఎన్నికలు
  • అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠం శ్రీ చంద్ర మౌళీశ్వర స్వామి ఆలయంలో నేటినుంచి మహా రథోత్సవం వేడుకలు ప్రారంభం.వారం రోజుల పాటు జరగనున్న వేడుకలు.
  • శ్రీకాకుళంలో మహిళా దినోత్సవం సందర్బంగా 7రోడ్ జంక్షన్ నుంచి ఉమెన్ పోలీస్ స్టేషన్ వరకూ 3k రన్
  • నేడు మహబూబాబాద్ లో కుల సంఘాల సన్నాహక సదస్సు. హాజరు కానున్న కోదండరాం, మందకృష్ణ మాదిగ,అద్దంకి దయాకర్
  • మహబూబాబాద్ లో బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ ధర్నా.
  • ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనున్న సభ.
  • అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం.బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్న అసెంబ్లీ షెడ్యూల్‌
  • ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు.