Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ భేటీ. తర్వాత పీసీస అడ్వైజరీ కమిటీ సమావేశం. మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాల అందజేత.

చెవిరెడ్డి మోహిత్‌ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ. లిక్కర్‌ స్కాంలో ఏ39 నిందితుడిగా ఉన్న మోహిత్‌రెడ్డి.

అమరావతి: నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌. రాజధాని నిర్మాణానికి మరింత భూ సేకరణపై నిర్ణయం. అదనపు భూమి కూడా పూలింగ్‌ ద్వారానే తీసుకునే అవకాశం.

నేడు తెలంగాణలో వామపక్ష పార్టీల నిరసనలు. ఇరాన్‌పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో వామపక్షాల నిరసన కార్యక్రమాలు.

తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ. మధ్యాహ్నం 3 గంటకు వసతి గదులు కోటాను విడుదల చేయనున్న టీటీడీ.

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులతో సీఎం రేవంత్‌ టెలీ కాన్ఫరెన్స్‌. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా సంబరాలు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌.

ప్రకాశం: నేడు పోలీస్‌ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు. నేటి నుంచి 27 వరకు నలుగురిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్‌ కుమార్‌.

నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ. మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో భేటీ కానున్న మంత్రివర్గ ఉప సంఘం. 20 లక్షల ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై చర్చ.

కామారెడ్డి : నేడు ఎల్లారెడ్డి లో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం పర్యటన. రూ.4.25 కోట్ల తో నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.

Exit mobile version