Minister Nimmala Ramanaidu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నైజమని దుయ్యబట్టారు.. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని మండిపడ్డారు. ఇరిగేషన్ వ్యవస్థ ను బ్రష్టు పట్టించిన చరిత్ర వైసీపీదే అన్నారు.. త్వరలో గోదావరి జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థను ఆధునికరిస్తామని వెల్లడించారు.. రేడార్ తో సర్వే చేసి డీపీఆర్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నాం.. కూటమి ప్రభుత్వం రైతుల పక్ష పాత ప్రభుత్వం ధాన్యం కొని 48 గంటల్లో రైతులు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం అన్నారు.. నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో డ్రైన్ తవ్వక పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వెల్లడిస్తూ.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు..
Minister Nimmala Ramanaidu: వైసీపీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికల్లో ఆరు సీట్లు కూడా రావని వాళ్ల భయం..!
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ..
- వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావని వాళ్ల భయం..

Nimmala