Site icon NTV Telugu

Central Minister Srinivas Varma: చిటికిన వేలితో లేపేసే దమ్ముంది..! కేంద్రమంత్రి వార్నింగ్..

Srinivas Varma

Srinivas Varma

Central Minister Srinivas Varma: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కారుమూరిపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మేం కనుక నీ భాష ఉపయోగిస్తే.. సాయంత్రానికి నువ్వుండవు గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు.. కారుమూరి నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుంది అంటూ హాట్‌ కామెంట్లు చేశారు..

Read Also: Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్

మీ నాయకుడు అసెంబ్లీకి రాడు, మీరు జనంలో తిరగరు.. ప్రకటనలు, ప్రేలాపనలు చేతగాని వ్యక్తులు మాట్లాడతారు అని కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు శ్రీనివాసవర్మ.. ఐదేళ్లపాటు మీ అరాచకాలు తట్టుకొని దమ్ము ధైర్యం ఉన్న రాజకీయాలు మేము చేశాం.. రాజకీయాల్లో భాష చాలా ముఖ్యం.. రోడ్డుమీదకు ఈడ్చి తంతామంటున్నారు.. మేమే కనక ప్రత్యక్ష చర్యలకు దిగితే సాయంత్రానికి మీరు ఉండరు.. అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయాలు ఇలా తగలబడ్డాయి.. ఎప్పుడో అధికారంలోకి వస్తామనే పగటి కలలు కంటున్నారు.. TDR బాండ్ల స్కామ్ లో కారుమూరి ఎప్పుడు అరెస్టు అయి లోపలికి వెళ్తారో.. ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు అంటూ వ్యాఖ్యానించారు.. ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా తణుకు అసెంబ్లీలో కారుమూరి ఏలాంటి అవినీతికి పాల్పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని కామెంట్ చేశారు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

Exit mobile version