TDP vs YSRCP: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని.. అన్ని రకాల రాజకీయాలు చేస్తూ కారుమురికి నూకలు లేకుండా చేస్తామన్నారు. అయితే, ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. నాకు నూకలు చెల్లుతాయని ఎమ్మెల్యే అరిమిల్లి చెప్పడం చూస్తుంటే.. తనని హత్య చేయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. ఎంపీటీసీ ఎన్నికల్లో తన ఇంటిని ముట్టడి చేయడం అందులో భాగమన్నారు. రోజుకి నాలుగు గంటలు తన గురించే ఆలోచిస్తూ ఎమ్మెల్యే అరమిల్లి బీపీ పెంచుకుంటున్నారు.. బీపీ పెరిగే చదువుకున్న అజ్ఞానిలా బూతులు తిడుతుంటే.. సంస్కారం అడ్డు వచ్చి ఎమ్మెల్యేని తిట్టలేకపోతున్నాను అన్నారు మాజీమంత్రి కారుమూరు నాగేశ్వరరావు.
Read Also: Vijayasai Reddy: నంబర్ 2 అనేది మిథ్య.. 6 నెలల్లో 2 నుంచి 2 వేలకు పడిపోయా..! సాయిరెడ్డి సంచలనం..
