అలర్ట్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ రెండు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దేశంలోకి మే చివరి రోజుల నుంచి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. క్రమంగా విస్తరించుకుంటూ దేశమంతటా వర్షాలు కురిపిస్తాయి.
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
అయితే తమిళనాడు తీరప్రాంతంలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని తూర్పు ప్రాంతాలు, నెల్లూరు జిల్లా ప్రాంతాలపై ఈ రుతుపవనాల ప్రభావం ఉండదు. నైరుతి రుతుపవనాలు హిమాలయాలకు వెళ్లి వాటిని దాటలేక తిరిగి వెనక్కు వస్తాయి. అయితే వెళ్లిన దారిలో కాకుండా బంగాళాఖాతం మీదుగా పయనిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలు అనికూడా అంటారు. నవంబరు మాసంలో ఇవి బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ఈ ప్రభావంతో అప్పుడప్పుడు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతాయి. దీంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఏటా ఇలాంటి వర్షపాతం నమోదు కాదు. గత మూడు, నాలుగేళ్లుగా అల్పపీడనాలు తోడు కావడంతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి.
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!