NTV Telugu Site icon

Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు

Wether Updates

Wether Updates

Weather Update: ఉత్తర వాయువ్య దిశ నుంచి పొడి గాలులు వీస్తుండటంతో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు. రాత్రికిరాత్రే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి రానున్న మూడు రోజుల పాటు పగటిపూట వేడిగాలులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ తెలంగాణలో సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఇక ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో చలి ఇవాళ, రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Read also: TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!

రాష్ట్రంలో నేడు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. దీంతో.. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నగరంలో ఉదయం పొగ మంచు ఏర్పడుతుంది. దీంతో.. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఇక.. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరాయి.

Read also: Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్‌ మృతి, 9 మందికి గాయాలు

మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లో 7.7కాగా..ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ 7.8 లో గా నమోదైంది. కొమురం భీం జిల్లా సిర్పూర్ 7.9 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదు కాగా.. నిర్మల్ జిల్లా జామ్ లో 10.1గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలుగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. రానున్న మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఈనేపథ్యంలో.. విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. అంతేకాకుండా.. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. అయితే.. రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Yadagirigutta: 21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ దంపతులు