తాము అధికారంలోకి వస్తే పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గోదావరి వరదలతో సతమతం అయిన విలీన మండలాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఇవాళ ఏలూరు జిల్లా వేలేరుపాడు, శివకాశీపురంలో పర్యటించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన.. నేను వస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరద ప్రాంతాలకు వచ్చారు.. ఉన్న ఇంటిని వదిలి వరద బాధితులు ఎంత కష్టంలో వున్నారో నేను అర్దం చేసుకోగలను.. 2 వేల రూపాయలతో బాధితుల కష్టాలు తీరవు, బాధితులు చాలా కష్టాల్లో ఉంటే సీఎం పుండు మీద కారం చెల్లాడు.. నేను పోలవరం కట్టలేనని చేతులెత్తేశారని ఫైర్ అయ్యారు.. ప్రాజెక్ట్ వల్ల నష్ట పోయే వారికి న్యాయం చేయాలని నా ఆకాంక్ష అన్న చంద్రబాబు.. ఇల్లు కట్టిస్తే వెళ్ళిపోతాయని బాధితులు చెబుతున్నారు.. వెయ్యి, రెండు వేల కోట్లు అయితే ఇస్తా రూ. 20 వేల కోట్లు అయితే నేను ఇవ్వలేను అని సీఎం అంటున్నారు.. మరి ఎందుకు హామీ ఇచ్చారు? అని నిలదీశారు.
Read Also: Amnesia Pub Case : అమ్మాయిని ట్రాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు
ఇక, సీఎం జగన్ పరామర్శకు వచ్చినప్పుడు పేటీయం బ్యాచ్ చప్పట్లు కొట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.. పేటియం బ్యాచ్, కోడి కత్తి కమలహాసన్ ఇక్కడికి వచ్చి.. నిజమైన బాధితుల పరిస్థితి చూడాలని సలహా ఇచ్చారు. పశువులకు వేసే గడ్డి విశ్వసనీయత లేనివారికి ప్రజలు తినిపించాలి అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. ఓట్ల కోసం పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి.. ప్రజలు కష్టాల్లో వుంటే గాల్లో తిరిగారని ఎద్దేవా చేశారు.. 41 కాంటూరు పరిధిలో మాత్రమే కాదు 45.75 కాంటూరు పరిధిలో ఉండే వారందరికీ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. పోలవరం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలన్నారు.. మరోవైపు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు మండలాలను కలిపి ఒక జిల్లా చేస్తామని ప్రకటించారు..
బురదలో వుండే వారి కష్టాలు తాడేపల్లి ప్యాలెస్‌లో వుండే వారికి తెలీదు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు.. ప్రజల మధ్య ఉండి వారి కష్టాలు తెలుసుకోవడం మానవత్వం వున్న ప్రభుత్వ లక్షణం అని హితవు పలికారు.. 30 ఏళ్లలో ఎప్పుడు రాని వరద వచ్చిందని చెబుతున్నారు.. జీవో నెం 1210 హూద్ హూద్ తుఫాన్ సమయంలో ఇచ్చాం.. దానికంటే ఎక్కువ సాయం చేస్తే మేమే శభాష్ అంటాం అని సవాల్ చేశారు.. చేతులెత్తేస్తే పోలవరం కట్టలేమన్న ఆయన.. ముంపు గ్రామాల ప్రజలు మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, విలీన మండలాల్లో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.. తన పర్యటనలో భాగంగా భద్రాద్రి రామయ్యను కూడా దర్శించుకోనున్నారు టీడీపీ అధినేత.