NTV Telugu Site icon

Somireddy: సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం..

Saomi Reddy

Saomi Reddy

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు. ఒక మొక్క కొట్టకుండా.. రోడ్డు వేయకుండానే కోట్ల రూపాయలలో నిధులు స్వాహా చేశారు.. ఒకే పనికి ఒక్కో ఏడాది వేరు వేరుగా నిధులు కేటాయించి దోచేశారని మండిపడ్డారు. ఒక పార మట్టి తీయకుండ బిల్లులు చేసుకున్నారు.. 5 ప్యాకేజీలతో మాజీ మంత్రి కాకాణి నిధులు దోచుకున్నారు.. వైసీపీ నేతల పాపాలకు రైతులు మూడు లక్షల ఎకరాల్లో మొదటి పంట పండిచుకో లేకపోయారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

Read Also: Game Changer: మతి పోగొడుతున్న కియారా లేటెస్ట్ స్టిల్ చూసారా..?

అలాగే, ఇసుక, మద్యం, ఖనిజాలను జగన్ దోచుకుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా దోచుకు తిన్నారు అంటూ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాణి గొంతు మీద కత్తి పెడితే.. బిల్లులు చేశామని అధికారులు చెబుతున్నారు.. అది తప్పు కదా ఎవరినీ వదిలేది లేదు.. సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం..
ఖచ్చితంగా విచారణ జరుగుతుంది.. అక్రమార్కులు ఎంతటి వారినైనా వదలం.. కాకాణి ఒక అధికారిని శ్రీకాకుళం బదిలీ చేశాడు.. మిగిలిన వారినీ.. శ్రీకాకుళం వెళుతారా అంటూ బెదిరించారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.