Site icon NTV Telugu

Srisailam: మల్లన్న బ్రహ్మోత్సవాలలో భక్తులకు నీటి కొరత

ప్రసిద్ధ శైవక్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పాతాళ గంగలో నీటిమట్టం భారీగా తగ్గిపోయింది. మెట్ల కిందకు నీటిమట్టం పడిపోవడంతో భక్తులకు నీటికొరత ఏర్పడింది. దీంతో భక్తులు స్నానాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం లేకపోవడంతో భక్తులు రోడ్ల మీదే సేద తీరుతున్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు 30 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. ఉచిత దర్శనాలకు 14 హాళ్లను ఏర్పాటు చేశారు. అటు రూ.200 దర్శనం క్యూల కోసం 8 హాళ్లు, రూ.500 దర్శనం క్యూల కోసం 6 హాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. శివస్వాములకు ప్రత్యేకంగా క్యూ అమలు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 13 వైద్య శిబిరాలు, 15 లడ్డూ ప్రసాదం కౌంటర్లను నిర్వహిస్తున్నారు. 1500 పోలీసులతో భారీ బందోబస్తు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Exit mobile version