NTV Telugu Site icon

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి పెరిగిన వరద.. లంక గ్రామాలకు అలర్ట్..!

Prakasham Bareje

Prakasham Bareje

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్‌మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎద్దుళ్ళ వాగు, పడమటి వాగు, కట్టలేరు, మున్నేరు, వైరా ఏరు పొర్లుతున్నాయి. వరద ఉధృతితో తాత్కాలికంగా భవాని ద్వీపాన్ని క్లోజ్ చేసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి, పెసర, మినుము, పంటలపై తీవ్ర ప్రభావం పడింది.

Read Also: Paris Olympics 2024: మరీ అందంగా ఉందని.. పారిస్ ఒలింపిక్స్‌ నుంచి పంపించేశారు! చివరకు షాక్‌

కాగా, కృష్ణా నదికి వరద పోటెత్తడంతో బ్యారేజీకి దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పులిగడ్డ ఆక్విడెక్ట్ దగ్గర వరద నీరు పది అడుగులకు చేరిపోయింది. వినగడప వాగు పొంగి పొర్లుతుండటంతో గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెం పట్టమటి వాగు పొంగిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు పోటెత్తడంతో కృష్ణ ఈస్టర్, వెస్ట్రన్ కాల్వలకు 13,768 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. దీంతో అధికారులు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను అలర్ట్ చేశారు.