NTV Telugu Site icon

Vuyyuru Bike Race culture: ఉయ్యూరుకి విస్తరించిన బైక్ రేసింగ్.. పేరెంట్స్ టెన్షన్

Race bikes

Collage Maker 22 Nov 2022 09.37 Am (1)

బైక్ రేస్ … యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తాయి. ఈ కల్చర్ కేవలం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాలకు పరిమితం కాలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్న చిన్న పట్టణాలకు కూడా ఈ బైక్ రేసింగ్ ధోరణి పాకిపోయింది. హైదరబాద్ తరహా హై టేక్ బైక్ రేసులు ఇప్పుడు కృష్ణ జిల్లా లోని ఉయ్యూరుకు కూడా పాకాయి…విజయవాడ నుండి మచిలీపట్నం వరకు వేసిన కొత్త హైవే తో యువత రెచ్చిపోతున్నారు..

సర్వీస్ రోడ్లను సైతం విడిచిపెట్టకుండా బైక్ లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు….సోషల్ మీడియా లైక్ ల కోసం బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు….గత ఆరు నెలలలుగా ఉయ్యూరులో జరుగుతున్న బైక్ రేస్ లు విన్యాసాలతో తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Read Also:Tim Southee: సూర్య గొప్ప ఆటగాడేమీ కాదు.. సౌథీ షాకింగ్ కామెంట్స్

ఎన్ని సార్లు హెచ్చరించిన సాయి మారకపోగా 20 రోజుల క్రితం బైక్ పైనిలబడి విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు ఓ యువకుడు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యం ఫలించక ప్రాణాలు వదిలాడు. బైక్ రేస్ ల సంస్కృతి వల్ల యువకులు పాడైపోతున్నారని, ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ తరహా సంస్కృతికి చెక్ పెట్టాలని,ఉయ్యూరు నుంచి మచిలీపట్నం, విజయవాడకు వెళ్ళే ప్రాంతాల్లో నిఘా ఉంచాలని కోరుతున్నారు.

Read Also: Narendra Modi: జోడో యాత్రపై మోడీ వ్యంగ్యాస్త్రాలు.. అధికారం కోసమే!