YS Jagan: నేడు విజయనగరం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

  • నేడు విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
  • గుర్లలో డయేరియా మృతి చెందిన కుటుంబాలను..
  • డయేరియా బాధితులను పరామ‌ర్శించనున్న జగన్..
Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.. గుర్లకు వెళ్లనున్న ఆయన.. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, డయేరియా బాధితులను పరామ‌ర్శించ‌నున్నారు. ఇక, విజయనగరం జిల్లా పర్యటనకు ఈ రోజు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న జగన్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు.. ఇక, డయేరియా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు వైఎస్‌ జగన్‌.. విజయనగరం జిల్లా పర్యటన ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు జగన్..

Read Also: Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా

ఇక, వైఎస్‌ జగన్‌ విజయనగరం జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ చూస్తే.. ఉదయం 9:30 తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న జగన్‌.. 11:05కి గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.. అక్కడి నుంచి 11:25కి గుర్ల గ్రామానికి చేరుకుంటారు.. 11:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డయేరియా మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.. డయేరియా బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు.. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన.. హెలికాప్టర్‌లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కు వెళ్లి.. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.