YS Jagan: రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియా బారినపడినవారిని పరామర్శించారు.. ఇక, ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తున్నాం అని ప్రకటించారు.. ఇక, ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు వైఎస్ జగన్..
Read Also: Bengaluru Traffic: బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలేసి నడిచి వెళ్లిన ప్రయాణికులు
ఢిల్లీలో మేం ధర్నా చేస్తుంటే డైవర్ట్ చేశారు.. మదనపల్లిలో రికార్డ్స్ కాలిపోయాయని హెలికాప్టర్ లో పంపించి హడావుడి చేశారు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. ఇక, 14 మంది చనిపోతే కనీసం మంత్రి కూడా రాలేదన్న ఆయన.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుదేలయిందని విమర్శించారు.. అయితే, ప్రతి ఇంట్లో ఉన్న గొడవలే మా ఇంటిలో కూడా ఉన్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్.. కానీ, నేను గుర్ల వస్తున్నానని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంత చేశారు.. నా ఫోటో.. నా చెల్లి ఫోటో.. మా అమ్మ ఫోటో పెడతారు.. మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలులేవా? అని నిలదీశారు.. డైవర్ట్ పాలిటిక్స్ వదిలి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి అని హితవు చెప్పారు. దత్తపుత్రుడిని కూడా అడుగుతున్న గుర్ల లాంటి సమస్యలపై దృష్టి పెట్టండయా అని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్..
Read Also: Nandamuri Kalyan Ram : ‘NKR21’ కీలక షెడ్యూల్.. వైజాగ్‌కి కళ్యాణ్ రామ్
ఆస్తి పంపకాల గొడవలు అందరి ఇళ్లలో ఉండేవే.. ప్రతి ఇంట్లో ఉన్న గొడవలే మా ఇంట్లోనూ ఉన్నాయి అన్నారు జగన్.. కానీ, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు.. మీ స్వార్థం కోసం ఇలాంటివాటిని పెద్దవిగా చేసి చూపించొద్దు అన్నారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..