Vangalapudi Anitha: గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజును కలిసి మంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నామినేట్ అవడం చాలా సంతోషంగా ఉంది.. విజయనగరం జిల్లాతో పాటు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కూడా అశోక్ గజపతిరాజు సేవలు విస్తరించాయి, అనడానికి ఇదొక మంచి ఉదాహరణ.. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తికి అయిన ఏదో ఒక చిన్న నింద ఉంటుంది.. కానీ, అశోక్ గజపతిరాజు మాత్రం కడిగిన ముత్యంలాంటి వ్యక్తి నీతికి, నిజాయితీగా విలువులకు మారుపేరే అశోక్ గజపతిరాజు.. చిన్న రికమండేషన్ చెయ్యమని ఎవ్వరైనా వెళ్ళినా, మీకు రికమండేషన్ చేస్తే, ప్రజాస్వామ్యంలో మరొక వ్యక్తి నష్టపోతారని చెప్పిన ఏకైక వ్యక్తి అశోక్ గజపతిరాజు మాత్రమే అని వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.
Read Also: Mohammad Azharuddin: మాజీ క్రికెటర్ భార్య బంగ్లాలో దొంగతనం.. నగదు, టీవీతో దొంగలు పరార్..!
ఇక, అశోక్ గజపతిరాజు గత యాభై ఏళ్లుగా విజయనగరం జిల్లాకు అనేక సేవలు చేశారని మంత్రి అనిత తెలిపారు. ఎంతో మందికి సేవలు అందిస్తూ, మాన్సాస్ ట్రస్ట్ ను నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి.. ఆయన వారసత్వంగా ఆయన కుమార్తెను ఎమ్మెల్యేలగా గెలిపించారు.. సమాజానికి మంచి చేయాలని ఆలోచనోతే ఆయన కుమార్తెను కూడా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు.. అజాత శత్రువుగా పేరు పొందిన వ్యక్తి అశోక్ గజపతిరాజు.. అలాంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు.. ఆ రోజు అశోక్ చాలా బాధపడ్డారు. నేనే స్వయంగా దగ్గర నుండి చూసాను.. ఏదో రకంగా ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు.. జగన్ కక్షలు కడితే- చంద్రబాబు సేవలను గుర్తించారు అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Read Also: Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ పెంపుకు పచ్చజెండా?
అయితే, లెజెండరీ పర్సనాలిటీ అయినటువంటి అశోక్ గజపతి రాజును కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని మంత్రి అనిత చెప్పుకొచ్చింది. యుద్ధానికి కూడా ఒక సమయం ఉంటుంది.. కానీ జగన్ చేసే యుద్ధానికి సమయం లేదు.. రాత్రి పగలు అని తేడా లేకుండా కక్షలు కడుతూ కేసులు పెట్టీ వేధించే వాడు.. అందుకే 151 నుండి 11 సీట్లకు దిగజారాడు.. ఎంతో మంది సీనియర్లను టచ్ చేశాడు.. అందుకే అదాః పాతాళానికి పడిపోయాడు.. సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి.. విలువలు, ఆదర్శం, నీతి, నిజాయితీ కలిగిన అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకున్నామని వంగలపూడి అనిత వెల్లడించింది.
గోవా గవర్నర్ గా నియమితులైన శ్రీ @Ashok_Gajapathi గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. విజయనగరంలోని వారి కోటలో సహచర మంత్రివర్యులు శ్రీ @SKondapalliOffl గారు, ఎంపీ శ్రీ @Kalisettitdp గారు, శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీమతి @Lalitha_KumariK గారితో కలిసి సత్కరించుకోవడం… pic.twitter.com/q9TT2GcoTB
— Anitha Vangalapudi (@Anitha_TDP) July 19, 2025