NTV Telugu Site icon

Vizianagaram: గుర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా.. తాగునీటి కాలుష్యం వల్లే వ్యాధి

Diarrhea

Diarrhea

వైద్య ఆరోగ్య శాఖ‌, స్థానిక వైద్య సిబ్బంది ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవడం వ‌ల్ల విజ‌య‌నగ‌రం జిల్లా గుర్ల‌లో డ‌యేరియా అదుపులోకొచ్చింద‌ని ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కృష్ణ‌బాబు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఆయ‌న వివ‌రాల‌ను అందించారు. వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాల మేర‌కు.. డ‌యేరియా ప్ర‌బ‌లిన వెంట‌నే ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తిని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు పంపించామ‌న్నారు. ఆమె అక్క‌డే ఉండి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డ‌యేరియా వ్యాప్తికి గ‌ల కార‌ణాల‌పై అధ్య‌య‌నం చేసి స‌మ‌గ్ర నివేదిక‌ను అంద‌జేసిందని తెలిపారు. ఆ గ్రామంలో తాగునీటి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించ‌గా.. క‌లుషిత‌మైన‌ట్లు తేలింద‌ని కృష్ణబాబు చెప్పారు. ఆ ప్రాంతంలో ప్ర‌జ‌లు బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేయ‌డం వ‌ల్ల భూగ‌ర్భ జ‌లం క‌లుషిత‌మ‌య్యింద‌ని.. నీటిని స‌ర‌ఫ‌రా చేసే పైపులు డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లో ఉండ‌డం వ‌ల్ల లీకేజీ వ‌ల‌న కూడా తాగునీరు క‌లుషిత‌మ‌య్యింద‌ని స్థానిక అధికారులు వివ‌రించారు.

Unstoppable 4 -NBK: అన్‌స్టాపబుల్‌ సీజన్ ఫోర్‌లో ఫస్ట్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు.. ప్రసారం ఎప్పుడంటే?

డీహైడ్రేష‌న్ బాగా ఉన్న డ‌యేరియా కేసుల్ని చీపురుప‌ల్లి సిహెచ్ సికి, విజ‌య‌న‌గరం జిజిహెచ్, వైజాగ్ కేజిహెచ్ ల‌కు త‌ర‌లించార‌ని.. ఇంటింటికీ స‌ర్వే చేసి అనుమానిత కేసుల్ని ఉచిత వైద్య శిబిరాల‌కు తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకున్నార‌ని కృష్ణ‌బాబు పేర్కొన్నారు. ప‌బ్లిక్ హెల్త్ స్పెష‌లిస్టు, ఎపిడిమాల‌జిస్ట్, మైక్రోబ‌యాల‌జీ, క‌మ్యూనిటీ మెడిసిన్ నిపుణుల‌తో ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేసి ఆప్రాంతంలో స‌మ‌గ్ర స‌ర్వే చేసి నివేదిక‌ను పంపించాల‌ని కృష్ణ‌బాబు ఆదేశించారు. నీరు క‌లుషితం కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ప్ర‌జ‌ల‌కు ట్యాంక‌ర్ల ద్వారా సుర‌క్షిత‌మైన నీరు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

ఈనెల 13న ఒక కేసుతో డయేరియా కేసులు మొద‌లు కాగా.. 14న 55 కేసులు, 15న 65 కేసులు న‌మోద‌య్యాయి. 16న 40 కేసులు, 17న 32 కేసులు, 18న 8 కేసులు న‌మోదుతో కేసులు తగ్గుముఖం ప‌ట్టాయి. శ‌నివారం నాడు ఒక్క‌ కేసే న‌మోద‌య్యింది. 53 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతుండ‌గా.. వారిలో గుర్ల జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్లో 17 మంది, వైజాగ్ కేజీహెచ్‌, జీజీహెచ్ విజ‌య‌న‌గ‌రం, ఘోషా ఆసుప‌త్రి, సీహెచ్‌సీ చీపురుప‌ల్లిల‌లో 36 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గుర్లలో డ‌యేరియా వ్యాధి వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య గురించి వివిధ ర‌కాల వార్త‌లొస్తున్నాయ‌ని.. కానీ వాస్త‌వంగా గుర్ల మండ‌లంలో డ‌యేరియా వ‌ల‌న ఒక్క‌రు మాత్ర‌మే చ‌నిపోయార‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ తెలిపారు. ఏడుగురు ఇత‌ర వ్యాధుల‌తో మ‌ర‌ణించార‌ని.. స్థానికంగా ప‌రిస్థితుల్ని ప‌ర్య‌వేక్షిస్తున్న ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబుకు నివేదిక పంపారు.