CM Chandrababu: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ గ్రోత్ ఇంజెన్ లా తయారవుతుందన్నారు.. హైదారాబాద్ కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎలా పని చేస్తుందో.. ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్ లో ఈ ఎయిర్‌పోర్ట్‌తో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని పేర్కొన్నారు.. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం చేశాను.. కానీ, వైసీపీ వాళ్లు వచ్చి మొత్తం కూని చేశారు.. పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.. 2700 ఎకరాల్లో 500 ఎకరాలు పక్కన పెట్టారు. చేసిన శంకుస్థాపలకే మళ్లీ శంకుస్థాపన చేశారు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యత కంపెనీల ప్రముఖులు..
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు 31.8 శాతం వర్క్ పూర్తి అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పౌరవిమానాయశాఖ మంత్రి, ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సంస్థ… ఇరువురూ ఉత్తరాంధ్రకు చెందినవారే అని గుర్తుచేశారు.. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ ప్రయాణికులు ప్రయాణించనున్నారు.. 400 కోట్లతో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తున్నారు.. ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో వివరాలు ఇవ్వమని అడిగానన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి అయితే చుట్టూ పక్కల ప్రాంతాలు అన్ని అభివృద్ది చెందుతాయన్నారు. ఇక, కొన్ని రాష్ట్ర రహదారులు గుంతలుగా ఉన్నాయి.. ఆ రోడ్లు అన్ని పూర్తి చేస్తాం అన్నారు. కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఓటు వేసేవారిని విస్మరించను.. వారి అభివృద్ది, సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు.
Read Also: Anant – Radhika Wedding : అనంత్ – రాధిక పెళ్లిలో ఈ “ఛాట్” ప్రత్యేకం..
2026 నాటికి ఎయిర్‌పోర్ట్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను అన్నారు సీఎం చంద్రబాబు.. మోస్ట్.. మోడరన్ ఎయిర్ పోర్టుగా ఈ ఎయిర్‌పోర్ట్ రెడీ అవ్వాలన్న ఆయన.. జీఎంఆర్ సంస్థకి కూడా చాలా ఎయిర్‌పోర్ట్‌లు కన్‌స్ట్రక్షన్‌కి వచ్చాయన్నారు. ఇక, ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాను అన్నారు చంద్రబాబు.. పవన్ కల్యాణ్, బీజేపీకి కూడా ఈ ప్రాంతం వాసులు మద్దతు ఇచ్చారు అని గుర్తుచేసుకున్నారు. ఇంకా రాష్ట్రంలో ఐదు ఎయిర్‌పోర్ట్‌లు కొత్తగా వస్తాయి… కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో మూడు ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..