ఒకవైపు ప్రైవేటైజేషన్, మరోవైపు ఆందోళనలతో విశాఖ ఉక్కు పరిశ్రమ హాట్ టాపిక్ అవుతోంది. అసలు విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ఏంటి? ఈ ఏడాది ఎంత టర్నోవర్ సాధించింది? అనే ప్రశ్నలకు కేంద్రం నుంచి సమాధానం లభించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే జవాబు చెప్పారు.
Chandrababu Naidu: పోలవరం పరిహారం హామీలేమయ్యాయి జగన్?
ఉక్కు ఉత్పత్తి, అమ్మకం, టర్నోవర్‌లలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించిందని మంత్రి తెలిపారు. 2021-22లో 28,214 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించింది. 2020-21లో సాధించిన టర్నోవర్‌తో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించిందని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో 16,618 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ నమోదు చేసిన “రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్” (ఆర్‌ఐఎన్‌ఎల్) 2021-22లో 28,214 కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు.
ఇదిలా వుంటే విశాఖ ప్రైవేటీకరణ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమాన్ అడిగిన ప్రశ్నకు ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే బదులిచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు పరిశ్రమ రూ. 913 కోట్లు లాభం ఆర్జించిందని తెలిపారు. కేంద్రం వైఖరిపై ఉక్కు పరిశ్రమ కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.
Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్