విశాఖలో మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు ఎంవీపీ పోలీసులు. అక్కయ్యపాలెంకు చెందిన రాహుల్, పెద గంట్యాడకు చెందిన అఖిల్ అనే ఇద్దరు యువకులు వద్ద నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
ఎల్ ఎస్ డి బ్లాస్ట్, గంజాయి, ఓసీబీ షీట్స్, ఎమ్ డిఎంఏ పిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎంవీపీ సీఐ రమణయ్య తెలిపారు. వీరిద్దరూ చెన్నైలో బిటెక్ చదివారు.అప్పటినుంచి వీరికి మత్తు పదార్ధాలు సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే సీతమ్మధారలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా రెండో వ్యక్తి సమాచారం తెలిసింది 21 LSD బోల్ట్స్,2గ్రామ్స్ ఎండిఎంఎ,20గ్రామ్స్ గంజాయ్, 2వేలు నగదు,బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రమణయ్య వెల్లడించారు. వీరి వెనుక ఇంకెవరు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇద్దరిని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.