NTV Telugu Site icon

VishnuVardhan Reddy: జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళారా.. విహారయాత్రకా?

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సీఎం జగన్ వరద ప్రాంతాల పర్యటనలో అసందర్భ వ్యాఖ్యలు చేశారు…ఇది సిగ్గుచేటు. కేంద్రం వద్ద డబ్బులు ముద్రించే మిషన్ కేంద్రం వద్ద ఉందని సీఎం.జగన్ అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఒక రూపాయి కూడా బకాయి లేదని పార్లమెంట్ లో చెబితే వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారు, ఆదాయం వచ్చే పనులు కాంట్రాక్టర్లు చేశారు.

అనుమతులు తీసుకొని పనులు చేయాలి. అనుమతి లేకుండా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను మార్చారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు 1వ, 2వ కృషునిలా మార్చారు. ప్రజలు ప్రధానిని తిడుతున్నారని సీఎం జగన్ ప్రధానికి చెప్తారా? సీఎం జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళారా లూక విహారయాత్రకు వెళ్లినట్టు వెళ్లారు. పోలవరం ముంపు బాధితులకు కేంద్రం ఇచ్చిన ఇల్లు ఎందుకు నిర్మించలేదు?

ఊర్లు కట్టిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పోలవరం ముంపు బాధితులకు ఇళ్ళను ఎందుకు నిర్మించలేదు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వమని జగన్ చెప్పలేకపోతున్నారు. 2017 లో ప్రత్యేకహోదకు బదులుగా ప్యాకేజి తీసుకున్నారు 7,800 కోట్లు తీసుకున్నారు. వైసీపీ , టీడీపీ కలసి బీజేపీని తిట్టిపోస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ అంశాల్లో బీజేపీని తిడుతున్నారు. ప్రాంతీయపార్టీలు రాష్ట్రానికి దరిద్రం….ఓటు బ్యాంకు రాజకీయాలు రాష్ట్రాలను గాలికొదిలేసాయి. పేద గిరిజన మహిళను బీజేపీ రాష్ట్రపతి భవన్ కు పంపితే కాంగ్రెస్ సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదీ బీజేపీ, కాంగ్రెస్ కు తేడా. ఏపీలో ప్రాంతీయపార్టీలు పోవాలి, బీజేపీ రావాలన్నారు విష్ణువర్థన్ రెడ్డి.

Prakasam Bus Accident: నిద్రమత్తులో అదుపుతప్పిన డైవర్‌.. 40 మంది ప్రయాణికులతో వెలుతున్న బస్సు బోల్తా