Vishaka: ఫిషింగ్ హార్బర్ లో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.. ఆదివారం రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి..
ఈ ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.. మత్స్యకారులు తమ బోట్లు అన్నింటిని హార్బర్ లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రం పైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. వారిలో రూ. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ఈ ప్రమాదంలో 20 బోట్లకు పైగా కాలి బూడిద అయ్యినట్లు చెబుతున్నారు.. మొత్తం రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.. అర్ద రాత్రి నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమిస్తూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. కానీ ఇప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.. విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో భారీ అగ్నిప్రమాదం ఇదే.. మొత్తం 40 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయినట్లు చెబుతున్నారు మత్స్యకారులు.. ఇక బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పదార్దాలు ఉండడంతో భారీ పేలుళ్లు సంభవించాయి.. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.. కళ్ళ ఎదుట జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో తీవ్ర విషాదంలో ఉన్నాయి మత్స్యకార కుటుంబాలు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!