రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతల దాడి… జిల్లా కలెక్టర్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
Read Also: కోవిడ్ బాధితులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ట్రస్ట్
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
రెవెన్యూ అధికారులపై దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ మల్లికార్జున సీరియస్ అయ్యారు. వైసీపీ నేత దొడ్డి కిరణ్‌ను భూ కబ్జాదారుడిగా పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌కు కలెక్టర్ లేఖ రాశారు. దొడ్డి కిరణ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేకంగా లేఖలో పేర్కొన్నారు. దొడ్డి కిరణ్‌తో పాటు దాడి చేసిన 20 మందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీంతో దొడ్డి కిరణ్ గ్యాంగ్‌పై పెందుర్తి పోలీసులు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. కాగా దొడ్డి కిరణ్ గ్యాంగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?