Site icon NTV Telugu

YSRCP: విశాఖ మేయర్‌ ఎన్నికలో కొత్త ట్విస్ట్..! వారిపై వైసీపీ ఫిర్యాదు

Ycp

Ycp

YSRCP: గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకున్నాయి.. ఇక, త్వరలోనే డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్‌ జరగనుంది.. అయితే, మేయర్‌ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.. అవిశ్వాసానికి ఎవరు అనుకూలంగా ఓటు వేశారు…? వ్యతిరేకంగా ఓటీ వేశారో…? తమకు తెలియజేయాలని కోరారు వైసీపీ నేతలు.. అంతేకాదు.. పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసేందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు..

Read Also: Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..

కాగా, ఏపీలోనే అతి పెద్దదైన గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్‌ పై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్‌ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్‌ విశాఖ పీఠం కూటమి వశం అయ్యింది.. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.. కోరం సరిపోవడంతో సమావేశాన్ని నిర్వహించి ఓటింగ్‌ చేపట్టారు..

Exit mobile version