Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: క్రికెట్ విషయంలో తలెత్తిన ఓ వివాదం యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెదగదిలి కొండవాలుకు చెందిన డిగ్రీ విద్యార్థి డోల అజిత్ (23)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, క్రికెట్ ఆట విషయంలో అజిత్ మరియు కిషోర్ అనే వ్యక్తి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతవారం పోలమాంబ పండుగ సమయంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం మత్తులో ఉన్న కిషోర్, పెదగదిలి జంక్షన్ వద్ద అజిత్‌ను కలుసుకుని మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో ఆగ్రహానికి గురైన కిషోర్ కత్తితో అజిత్‌ను పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అజిత్‌ను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక, ఘటన అనంతరం నిందితుడు కిషోర్ స్వయంగా ఆరిలోవ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..