Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
Weather Updates in Regional Languages: రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వాతావరణ సమాచారాన్ని ఇకపై ప్రాంతీయ భాషల్లో అందించే సరికొత్త సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వ్యవసాయ రంగానికి మరింత సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, చాట్ జీపీటీ తరహాలో పనిచేసే ‘మౌసమ్ వాణి’ అనే ప్రత్యేక అప్లికేషన్‌ను Indian Institute of Tropical Meteorology (IITM) అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన వాతావరణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల రైతులకు ఇది మరింత ఉపయోగకరంగా మారనుంది.
Also Read
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
ప్రారంభ దశలో ఈ సేవను హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం దశలవారీగా తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు తమ స్థానిక భాషలోనే వాతావరణ వివరాలు పొందగలుగుతారు. ఈ అప్లికేషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం స్మార్ట్ఫోన్లకే పరిమితం కాకుండా సాధారణ బేసిక్ మొబైల్ ఫోన్లలో కూడా పనిచేసేలా రూపుదిద్దుకుంది. దీంతో ప్రతి రైతుకూ ఈ సౌకర్యం చేరే అవకాశం ఉంది. ‘నౌకాస్ట్’ మరియు రియల్‌టైమ్ వాతావరణ సమాచారాన్ని కేవలం కొన్ని సెకన్లలోనే పొందగలుగుతారు. ఈ వినూత్న సేవను త్వరలోనే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం వల్ల రైతులు ముందస్తు వాతావరణ సమాచారం ఆధారంగా తమ వ్యవసాయ పనులను సక్రమంగా ప్రణాళిక చేసుకోవడానికి పెద్ద మద్దతు లభించనుంది.
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!