Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచి నిరవధిక బంద్..
- విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్..
- రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె..
- తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్..
- సమ్మెకు వెళ్తున్న 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగింది.. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు.. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు.. మొత్తంగా రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు.. దీంతో, అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
మరోవైపు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు పలికింది ఉక్కు పోరాట కమిటీ.. కుట్ర పూరితంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతుందని విమర్శించారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు.. స్టీల్ ప్లాంట్ లో జరుగుతోన్న పరిణామాలపై స్పందించాలి.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.. లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించింది ఉక్కు పోరాట కమిటీ..
Read Also: Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్సూన్ అప్డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..
ఇక, కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ.. మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు..? అని నిలదీశారు.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిలబెట్టుకోవాలని సూచించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేసింది అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!