MP Bharat: ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు విశాఖ ఎంపీ శ్రీభరత్.. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. సుమారు రూ.9.8 లక్షల కోట్లు విలువైన MoUs చేసుకునే అవకాశం ఉందన్నారు.. విశాఖలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని పేర్కొన్నారు. ఇక, విశాఖ సుందరీకరణపై స్పందించిన ఎంపీ.. “అవి షో కోసం కాకుండా, ప్రతి పైసా విలువైన విధంగా ఖర్చు అవ్వాలని చూస్తున్నాము” అన్నారు.
Read Also: Ande Sri Death: హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ చనిపోయారు.. గాంధీ వైద్యుల డిక్లేర్
వైసీపీపై విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శ్రీభరత్.. “రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీకి ఇష్టం లేదన్న ఆయన.. పేదలను పేదగానే ఉంచడం వారి విధానం. అభివృద్ధి అంటే విరగ్గొట్టడమని, అడ్డుకోవడమని భావిస్తున్నారు” అని విమర్శించారు. పరిశ్రమలకు భూములు కావాలంటే అడ్డుకుంటారు.. మెడికల్ కళాశాలల పెట్టుబడులు వస్తున్న సమయంలో ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. నిజంగా కళాశాలలపై ప్రేమ ఉంటే రుషికొండపై రూ.500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు?” అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా చాల కష్ట్నాల్లో ఉంది.. అన్నింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గతంలో ముఖ్యమంత్రి పర్యటనకు రూ.7 కోట్లు ఖర్చు అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన ఖర్చు రూ.25 లక్షలు మాత్రమే అని స్పష్టం చేశారు.. రాష్ట్రం ఎంత తక్కువ ఖర్చులు చేస్తుంది అనేదానికి ఇదే నిదర్శణం అని అభివర్ణించారు.. వైసీపీలో “బండ బూతులు తిడితే నామినేటెడ్ పదవి.. మర్డర్ చేస్తే మంత్రి పదవి ఇస్తారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.. అన్నారు.
