TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Mahanadu: మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో ఈసారి కీలక మార్పులు చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.. ఇంధన వనరుల పొదుపును దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాస్, నెల్లూరులో మహానాడు కోసం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించడం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
కోవిడ్ సమయంలో వర్చువల్ మహానాడును విజయవంతంగా నిర్వహించిన అనుభవం తమకు ఉందని ఆయన గుర్తు చేశారు పల్లా.. అదే తరహాలో ఈసారి సాంకేతికతను వినియోగిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణంగా మహానాడు నిర్వహణకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని, దాదాపు 10 వేల వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తాయని చెప్పారు. ఈ భారీ రవాణా వల్ల ఇంధన వినియోగం అధికమవుతుందని, అందుకే ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకున్నామని పేర్కొన్నారు.
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పల్లా శ్రీనివాస్.. ఇందుకోసం మొత్తం 1848 భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయ ప్రాంగణంలో 68 మంది సీనియర్ నేతలతో కూడిన ప్రత్యేక బృందం మహానాడు కార్యక్రమానికి దిశానిర్దేశం చేయనున్నట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?