CM Chandrababu: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సహా 8 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టాలెంట్కి కొరత లేదని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా మారబోతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇక, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వస్తాయి.. విశాఖను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తామని భరోసా కల్పించారు. అన్ని నగరాల కంటే విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువగా ఉంటుంది.. అలాగే, విశాఖను మరింత సుందరమైన నగరంగా, కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Vaibhav Suryavanshi 175: వైభవ్ సూర్యవంశీ మరో తుఫాన్ సెంచరీ.. 14 సిక్సులు, 30 బంతుల్లోనే..!
అయితే, విశాఖపట్నం లాంటి సుందరమైన నగరం ఇంకోటి లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ కంపెనీకి విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలి అని కోరారు. నేను ఏది చేసినా మెగా స్కేల్ లో ఉంటుంది.. భవిష్యత్ లో వైజాగ్ రూపరేఖలు మారబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుంది అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో 8 సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నాం.. వచ్చే ఏడాది ఆగస్టులోగా భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు మెట్రో రైలు కూడా అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
