Site icon NTV Telugu

Rain Alert: విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు

Rainalert

Rainalert

విశాఖకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. దీంతో సింహాచలం ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి భక్తులు క్యూకట్టారు. వర్ష సూచన నేపథ్యంలో భక్తులకు వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక వాలంటీర్లు కూడా వేగంగా దర్శనాలు చేయిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి

అప్పన్న స్వామి చందనోత్సవానికి మంగళవారం రాత్రి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అర్ధరాత్రి భారీగా వర్షం కురిసింది. దీంతో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురుకి గాయాలయ్యాయి. అప్రమత్తమైన అధికారులు శిథిలాలు తొలగించి ఏడుగురు మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ప్రాణాలు వదిలారు. ఇద్దరు సాప్ట్‌వేర్ దంపతలు, ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి

ఇక మ‌‌ృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version