Site icon NTV Telugu

PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Pm Modi

Pm Modi

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్‌లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు

Read Also: Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ చిత్రంపై ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు కీలక పోస్ట్..

ప్రధాని టూర్ విజయవంతం అయితే ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి మరికొంత సహాయం కోరే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పోలవరంతో పాటు రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లు కేంద్రం నుంచి తీసుకు రావడం.. విభజన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడడంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, షెడ్యూల్ నైన్ అండ్ టెన్‌లో ఆస్తుల విభజన.. ఇలా కేంద్రం నుంచి పనులు జరగాల్సినవి ఉన్నాయి.

Read Also: Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్..

ఎన్డీయేలో భాగస్వాములుగా టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఉండడంతో కేంద్రం కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని టూర్ తర్వాత కేంద్ర బడ్జెట్ పెట్టె లోపు అవసరం అయితే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి మరికొంత సహాయం అడిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రధాని టూర్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఎన్డీయే ప్రభుత్వం ఆరు నెలల పాలన తర్వాత ప్రధాని మోడీ రావడంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్లాన్ చేస్తోంది.

Exit mobile version