NTV Telugu Site icon

PM Modi Vizag Tour: నేడు విశాఖకు ప్రధాని మోడీ..

Pm Modi Vizag Tour

Pm Modi Vizag Tour

PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం నాలుగు గంటలకు మోడీ విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో చేస్తారు. ఈ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. బహిరంగసభ జరిగే వేదికను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని SPG తమ అధీనంలోకి తీసుకుంది. 5 వేల మంది పోలీసులు సభా ప్రాంగణానికి పహారాగా ఉన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని మోడీ పర్యటన, రోడ్‌ షో, సభ జరుగుతుంది. ఇందుకోసం 35 మంది ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Read Also: JPC First Meeting: నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..

ఇక, విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిలో విశాఖ రైల్వే జోన్‌ ఉంది. సభా వేదికపై ప్రధాని దాదాపు గంట సేపు ఉంటారు. సభా ప్రాంగణంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు వీవీఐపీ పాసులు జారీ చేస్తున్నారు. ప్రధాని సభకు వచ్చే వారికోసం 26 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. మోడీ రోడ్ షో మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. సభ కోసం జనాన్ని తరలించేందుకు వేలాది బస్సులను సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు కూటమి నేతలు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విశాఖ నగరం ముస్తాబైంది. 2లక్షల 8వేల కోట్ల విలువైన పథాకలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు INSడేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు.. అక్కడి నుంచి రోడ్‌షో నిర్వహిస్తారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రాయూనివర్శిటీ గ్రౌండ్స్ వరకు సుమారు కిలో మీటరు పాటు ర్యాలీ సాగుతుంది. ఆ తర్వాత భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. విశాఖ రైల్వేజోన్ సహా పలు కీలక పరిశ్రమలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Show comments