Tirumala Model Hotel: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తారు.. శ్రీవారి గర్భాలయంలో ఒక్కసారి అయినా అడుగుపెడితే చాలు అని భావించేవారు కొందరైతే.. ఏడాది ఓసారి.. నెలకు ఓసారి.. ఇలా రెగ్యులర్‌గా వెళ్లే భక్తులు కూడా ఉంటారు.. ఇలా నిత్యం తిరుమల గిరులు కళకళలాడుతుంటాయి.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..? తిరుమల వెంకటేశ్వరస్వామి గర్భాలయం నమూనాతో ఓ హోటల్ వెలిసింది.. వెజ్ హోటల్ అయితే, భక్తులు హర్షించేవారేమో.. కానీ, నాన్‌వెజ్ హోటల్.. తిరుమల కొండను భక్తులు పవిత్రంగా భావిస్తారు.. ఇక, గర్భాలయంలో అడుగుపెట్టి భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు.. ఇప్పుడు శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్‌వెజ్ హోటల్ పెట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు..
Read Also: Maharashtra: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్.. అధికారిక ప్రకటన మరింత ఆలస్యం..?
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ ఏర్పాటు చేసి.. తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపారాలకు వాడుకుంటున్న వైనం వెలుగు చూసింది.. జయ, విజయలతో పాటు బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖర పడితో కూడిన నమూనా ఆలయం ఆ హోటల్‌లో ఏర్పాటు చేశారు.. విశాఖ హైవే దగ్గర రాయుడు మిలిటరీ హోటల్ పేరుతో నిర్వహిస్తోన్న హోటల్‌లో శ్రీవారి గర్భాలయ నమూనాతో హోటల్ ఉంది.. దీనిపై టీటీడీ ఈవో, చైర్మెన్ కు ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్.. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు, చర్యలు తీసుకోకపోతే హోటల్ వద్ద ఆందోళనకు దిగుతామని కిరణ్ రాయల్ ప్రకటించారు.. ఇలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు కిరణ్ రాయల్..
Read Also: DPL 2025 Auction: డీపీఎల్ 2025 వేలంలో విరాట్ కోహ్లీ కొడుకు!
అయితే, తిరుమలలో వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రాధాన్యత ఎంత ఉంటుందో.. మా ఆంధ్ర రెస్టారెంట్‌లో కూడా అంత ప్రాధాన్యత ఉంటుందంటున్నారు నిర్వాహకులు.. అయితే, చాలా మంది అడుగుతున్నారు.. వేంకటేశ్వరస్వామిని పెట్టి.. నాన్‌వెజ్ ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు.. కానీ, ఆ వెంకన్నను భక్తి శ్రద్ధలతో పూజిస్తాం.. అంతేకాదు, వేంకటేశ్వరస్వామి టెంపుల్ నమూనా ఉన్న ముందు అసలు నాన్‌వెజ్‌ను వడ్డించమని చెబుతున్నారు.. చాలా మంది ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతున్నారు.. అక్కడ ఫొటోలు దిగుతున్నారు.. ఇవన్నీ చూస్తే తమకు చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు నిర్వాహకులు.. ఇప్పుడు ఆ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు వెల్లడంతో.. టీటీడీ ఎలా స్పందిస్తుంది.. నిర్వాహకులు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది..
