NTV Telugu Site icon

Navy Day Celebrations: విశాఖలో అబ్బుర పరిచిన నేవీ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో..

Navy Day Celebrations In Vi

Navy Day Celebrations In Vi

Navy Day Celebrations: నేవీ డే సందర్భంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విశాఖలో నేవీ వేడుకలు అబ్బురపరిచాయి.. నేవీదళ విన్యాసానాలతో ఆర్కే బీచ్‌ యుద్ధ భూమిని తలపించింది.. శక్తి యుక్తులు ప్రదర్శించాయి అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు.. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో నిలిచింది.. ఫ్లై ఫాస్ట్ లో పాజెట్ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి.. తీరానికి అత్యంత సమీపంగా సత్తా చాటాయి చెతక్ హెలికాప్టర్లు… హాక్ విమానాల రణ నినాదంతో దద్దరిల్లిపోయింది సాగర తీరం.. గగుర్పాటుకు గురి చేశాయి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ALH విన్యాసాలు.. శత్రువుల ఆర్థిక మూలాలను దెబ్బికొట్టే విన్యాసాలు ప్రదర్శించాయి మార్కోవస్.. 8 వేల అడుగుల ఎత్తు నుంచి స్క్రి డైవింగ్ చేశారు నేవీ సిబ్బంది..

Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు..

ఇక, బాంబుల వర్షం కురిపించింది నిఘా విమానం బోయింగ్ P 8ఐ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేవీ విద్యార్థినుల హార్న్ పైప్ డాన్స్.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దాదాపు 8వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్‌ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను ఆశ్చర్యపర్చారు నేవీ సిబ్బంది.. సాగర తీరంలో యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు సందడి చేశాయి. నేవీ డే విన్యాసాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన నగరవాసులతో సాగర తీరం జనసంద్రంగా మారిపోయింది.. నేవీ వేడుకలను తన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో ఆసక్తిగా తిలకించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments