NTV Telugu Site icon

GVL: విశాఖ గ్రోత్ హబ్గా మారుతుంది..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.

Read Also: Joint Staff Council Meeting: సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చలు..

ఖతార్లో మరణ శిక్ష పడ్డ మాజీ నేవీ అధికారులకు విముక్తి కలగడం సంతోషమని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. విశాఖకు చెందిన సుగుణాకర్ ఈ జాబితాలో ఉన్నారని అన్నారు. మాజీ సైనికులలో ఆందోళన కలిగించిన ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ మాటలకు అందనిదని కొనియాడారు. మరోవైపు ఢిల్లీలో రైతుల ఆందోళనలు రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నవి అని.. ఎన్నికల సమయంలో ఇటువంటి రాజకీయల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లబోదని ఆయన అన్నారు.

Read Also: PM Modi: మోడీని కలిసిన భారతరత్న కర్పూరీ ఠాకూర్ ఫ్యామిలీ