Minister Satya Kumar Yadav: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్.. వెళ్లిన ప్రతీసారీ దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి… కొట్లాటలు, రాళ్ల దాడులు చేయడం, వికృతమైన భాష వాడటం.. లేదంటే కార్యకర్తలను కార్లతో తొక్కించి చంపేయడం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు..
Read Also: Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్‌మీ C71 లాంచ్..!
ఇక, చంపేసిన తర్వాత పశ్చాతాపం కూడా లేకుండా..? మా కార్యకర్తె కదా..? మీకేమీ నొప్పి అని అడుగుతున్నారు అంటూ వైసీపీపై ధ్వజమెత్తారు మంత్రి సత్యకుమార్.. పరిహారం ఇచ్చాం కనుక మీకేమీ సంబంధం అనేది బాధ్యతా రాహిత్యం అవుతుందన్నారు.. ఇది ప్రతిపక్ష నేత (వైఎస్ జగన్) మానసిక ధోరణికి నిదర్శనం అన్నారు.. మరోవైపు, ఏజెన్సీ ప్రాంతంలో ఫీడర్ అంబులెన్సులు పునరుద్ధరణ చేస్తున్నాం… 860 బైక్ ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు టెండర్లు పిలుస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
