Site icon NTV Telugu

Minister Nadendla: రేషన్ బియ్యాన్ని గుర్తించేలా ర్యాపిడ్ కిట్స్..

Nadendla

Nadendla

Minister Nadendla: విశాఖపట్నంలో పీడీఎస్ రైస్ గుర్తించే రాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాం.. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి మన దేశానికి చెందిన పీడీఎస్ రైస్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 5, 65, 000 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.. వీటి విలువ రూ. 245 కోట్లు ఉంటుంది.. గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదేళ్లలో ఇలాంటి చర్యలు వైసీపీ తీసుకోలేదన్నారు. పీడీఎస్ రైస్ ఎగుమతులపై చర్యలు చేపట్టిన తర్వాత విశాఖ పోర్టు నుంచి కూడా ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తించాం.. పీడీఎస్ రైస్ మాఫియా ముఠాను మేం కంట్రోల్ చేయగలుగుతున్నాం.. మా దగ్గర ఉన్న సిబ్బందితో ఎగుమతి అవుతున్న పీడీఎఫ్ రైస్ ని పరీక్షలు జరిపి జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు.

Read Also: Trump: ఇజ్రాయెల్‌కు బయల్దేరేటప్పుడు భారీ వర్షం.. గొడుగుతో ఇబ్బంది పడ్డ ట్రంప్.. వీడియో వైరల్

అయితే, విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు. విశాఖలో 33 మంది సిబ్బందితో మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం.. ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నాం.. నిఘా అధికారులు అక్రమాలకు పాడుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీలో అక్రమంగా ఎగుమతి చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించడానికి సిద్ధం చేసిన 700 మొబైల్ కిట్స్ ను మీడియాకు మంత్రి నాదెండ్ల మనోహర్ చూపించారు.

Exit mobile version