Minister Kollu Ravindra: ఈ ఐదు ఏళ్లలో అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని సమాకూరుతాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర గనులు, ఎక్కైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు.. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు వేదాశీర్వచనం చేశారు పండితులు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేవుడు.. రాష్ట్ర ప్రజలంతా సుఖషాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాము.. ప్రజల కోరిక మేరకు సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు.. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు.. ఉన్న పరిశ్రమల్ని మూసేశారని విమర్శించారు.
Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు మళ్లీ నోటీసులు..
చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద సంస్థలు వస్తున్నాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, విశాఖ పట్నంలో కొండాలని, ఘనులను, భూములను దోచుకున్నారు.. ఋషికొండలో ప్రజల సొమ్ముతో ప్యాలస్ లు కట్టుకున్నారని ఫైర్ అయ్యారు.. ఈ రోజు మాట ప్రకారం పెన్షన్లను 1వ తేదీన అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం… ఈ ఐదు సంవత్సరాలలో అనేక పరిశ్రమలు వస్తాయన్నారు.. గతంలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు సైతం రాష్ట్రానికి రాబోతున్నాయని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.
