Site icon NTV Telugu

Cyber Fraud: విశాఖలో డిజిటల్ మోసం కలకలం.. రూ. 2.61 కోట్ల ఫ్రాడ్ బయటకు!

Cyber Frud

Cyber Frud

Cyber Fraud: విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా, ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని.. సుమారు రూ. 2.61 కోట్లను కాజేసింది. ఈ ఘటనపై బాధితుడు సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక, సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు విచారణ చేయగా.. 2023 డిసెంబరులో ఆ డాక్టర్ ను BSE & NSE డీప్ ఇన్సైట్ -9827, షేర్ – 999 అనే వాట్సప్ గ్రూపుల్లో చేర్చినట్లు గుర్తించారు. స్టాక్ ట్రేడింగ్, ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్, ఓటిసి స్టాక్స్, ఐపీఓలు లాంటి వాటిలో పెట్టుబడి పెడితే.. తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.

Read Also: Congress Dharna: నేడు ఢిల్లీలో కాంగ్రెస్‌ మహాధర్నా.. హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేతలు!

దీంతో ఆ వైద్యుడు వారి మాటలు నమ్మి రూ. 2.61 కోట్లను బదిలీ చేశారు. ఇక, ఆ తర్వాత సైబర్ ముఠా ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలోకి మార్చి, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల ద్వారా నగదును విత్‌డ్రా చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అలాగే, విచారణలో ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని లాజ్‌పత్ నగర్ సాహిదాబాద్‌కు చెందిన రాజీవ్ బన్సాల్ (సలీం ఖాన్)ను గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, స్టాంపులు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులను హస్తగతం చేసుకున్నారు.

Exit mobile version