NTV Telugu Site icon

Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case

కిలాడీ లేడీ జాయ్ జెమిమా హనీట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేమిమాను కస్టడీలో తీసుకున్న భీమిలీ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. జమీమాతో ఎవరు హానీట్రాప్ చేయించారనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీపీ.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లోని డేటా కీలకంగా మారింది. అయితే.. తెలివిగా ముందే మొబైల్‌లోని కీలక డేటాను ల్యాప్ టాప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంది కిలేడి. ఈ క్రమంలో.. ఫోన్ పే వంటి నగదు ట్రాన్సాక్షన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా.. పోలీసుల వద్ద కిలేడీ ఏడుస్తూ తననే మోసగించారని డ్రామాలు చేసింది. అయితే.. ఈ కిలేడీ లేడీ ట్రాప్ చేసి పలువురి దగ్గర నుండి లక్షలు కాజేసింది. ఫోటో షూట్‌ల కోసం, రీల్స్ కోసం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది జాయ్ జెమిమా. కాగ.. ఈ కేసులో మరోసారి మహిళను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

Read Also: Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..

మాయ లేడీ జాయ్ జేమియా.. 10 నెలల కిందటే ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ జెరేమియను హాని ట్రాప్ చేసి.. రేప్ కేసు పెట్టించింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో దీనిపై FIR నమోదు చేశారు. ఆ సమయంలో జేమియ మోసాలను గుర్తించలేకపోయిన పోలీసులు.. అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారు. అయితే.. అదే వ్యక్తి హాని ట్రాప్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో.. అసలు బండారం బయటపడింది. ఇలా చాలా మందిని ట్రాప్ చేసిన కిలేడీ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగేది. ఈ క్రమంలో.. అమెరికాలో ఉంటున్న విశాఖకు చెందిన మురళీ అనే వ్యక్తిని మాయ మాటలు చెప్పి డబ్బులు కాజేసింది. పెళ్లి చేసుకోవాలని బెదిరించేది.. లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. ఈ క్రమంలో.. ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించి అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదుపులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.

Read Also: CPI Narayana: జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారు.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు