Site icon NTV Telugu

MLC Nagababu: నాకు పదవుల మీద ఆశ లేదు.. కానీ..!

Mlc Nagababu

Mlc Nagababu

MLC Nagababu: నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు… జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.. మరోవైపు, జనసేన సభ్యత్వం ఏ కార్యాకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వరిస్తాయని వ్యాఖ్యానించారు నాగబాబు..

Read Also: Aircraft: బీహార్ యువకుడి ఘనత.. రూ. 7,000 ఖర్చుతో.. స్క్రాప్‌ని ఉపయోగించి ఎగిరే విమానం తయారీ(వీడియో)

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ నేతలను ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదన్నారు నాగబాబు.. అయితే, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.. హరి హర వీర మల్లు సినిమాపై వైసీపీ చేసే ప్రచారం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు, జనసేన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకున్నటుందని వెల్లడించారు.. ఉత్తంరాంధ్ర మూడు జిల్లాల్లో జనసేన కార్యకర్తలను పల కరిస్తాను.. ప్రతి నెల జనసేన మీటింగ్ నిర్వహిస్తాం.. నెలలో 10 రోజులు విశాఖపట్నంలోనే ఉంటాను అని తెలిపారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు..

Exit mobile version